CSK vs KKR: హై ఓల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా

CSK vs KKR: హై ఓల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా

గెలుపు వరకు వచ్చి ఓడిపోతున్నాం.. ఈ మ్యాచ్ అయినా కచ్చితంగా కొట్టాలి అని కోల్ కతా.. హోమ్ గ్రౌండ్.. అచ్చొచ్చిన పిచ్ పై గెలిచి తీరాలని చెన్నై.. వ్యూహాలకు పదును పెట్టిన వేళ.. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. రెండు బ్లాక్ బస్టర్ టీమ్స్ మధ్య జరగబోయే హై ఓల్టేజ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్ కు అనుకూలించే ఈ పిచ్ బౌలింగ్ లో చెన్నైని తక్కువ స్కోర్ కు కట్టడి చేసి.. ఛేజింగ్ లో గెలవాలనే ప్లాన్ లో కోల్ కతా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇవాళ్టి (శుక్రవారం 11) మ్యాచ్ లో చెన్నై స్క్వాడ్ లో రెండు మార్పులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు ముకేష్ చౌదరి ఆడటం లేదు. వీరి స్థానంలో రాహుల్ త్రిపాఠి, అన్షుల్ కంబోజ్ టీమ్ ప్లేయింగ్ లెవెన్ లో కి యాడ్ అయ్యారు. 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): 

డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ధోనీ (c & wk), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, వైభవ్ అరోరా.

కోల్ కతా నైట్ రైడర్స్  (ప్లేయింగ్ XI): 

క్వింటన్ డీకాక్ (wk), సునీల్ నరైన్, అజింక్యా రహానే (c), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, మొయిన్ అలీ,  రమన్ దీప్ సింగ్, వైభవ్ అరోరా,  హర్షిత్ రాణా,   వరుణ్ చక్రవర్తీ.