CSK vs PBKS: తొమ్మిదో సారి టాస్ ఓడిన చెన్నై.. గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు పదిలం

CSK vs PBKS: తొమ్మిదో సారి టాస్ ఓడిన చెన్నై.. గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు పదిలం

ఐపీఎల్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం(మే 01) చెపాక్ గడ్డపై పంజాబ్ కింగ్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై.. ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌ను ఢీకొంటోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి సామ్ కర్రాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు పదోసారి నాయకత్వం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఒకేసారి టాస్ గెలిచాడు. ఈ లెక్కల పరంగా అతని టాస్ ప్రిడిక్షన్ ఎంత ఖచ్చితత్వంతో కూడినదో ఆలోచించదగినది. ఖాళీ సమయాల్లో టాస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ అదృష్టం అతన్ని వరించడం లేదు.

తుది జట్లు

చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్.

పంజాబ్‌: జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.