చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ మరో సమరానికి సిద్ధమైంది. గురువారం(ఏప్రిల్ 18) చండీగర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ సారథి సామ్ కర్రన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హర్దిక్ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. వరుసగా విఫలమవుతోన్న బెయిర్ స్టో స్థానంలో రిలీ రోసో జట్టులోకి వచ్చాడు. అనారోగ్యం కారణంగా కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. మరోవైపు, ముంబై తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.
పంజాబ్ కింగ్స్: రిలీ రోసో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.