IPL2025: CSK vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..

IPL2025: CSK vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..

IPL లో రెండు బలమైన టీమ్స్ మధ్య మ్యాచ్.. ఒకటి 5 ఐపీఎల్ ట్రోఫీలతో కాన్ఫిడెంట్ గా ఉన్న చెన్నై.. మరొకటి ఇప్పటికీ కప్ వేటలో కసిగా ఎదురు చూస్తున్న బెంగళూర్. ఈ రెండు హెవీ వెయిట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ్టి(శుక్రవారం మార్చి 28) CSK vs RCB మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ 2024 మే 18న జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నైని ఓడించి బెంగళూర్ ప్లే ఆఫ్స్ కు  వెళ్లింది. ఆ తర్వాత జరుగుతున్న ఈ మ్యాచ్ పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. చెన్నై హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరుగుతన్న మ్యాచ్ కావడంతో.. అంచనాలు పెరిగాయి. బేసికల్ గా ఇప్పటివరకు ఈ స్టేడియంలో RCB పై చెన్నైదే పైచేయి. కేవలం 2008లో ఒకే ఒక్కసారి CSK ను బెంగళూర్ ఓడించిది. అప్పటి స్వాడ్ నుంచి కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. మరి ఈ మ్యాచ్ లో కోహ్లీ చెన్నైకి బిగ్ టార్గెట్ ఇచ్చేలా ఆడతాడా లేదా అనే అంచనాలు ఉన్నాయి. 

స్వాడ్ (టీమ్స్):

RCB : 

ఫిలిఫ్ సాల్ట్, విరాట్ కోహ్లీ, పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లివింగ్ స్టోన్, శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్య, హెజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, దయాల్

 CSK:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, త్రిపాఠి, రవీంద్ర జడేజా, శామ్ కరణ్, ధోనీ, అశ్విన్, నూర్ అహ్మద్, పతిరణ, కె.అహ్మద్

కెప్టెన్సీకి పరీక్షే:

ఇక చెన్నై కెప్టెన్ రతురాజ్ గైక్వాడ్ కు ఎప్పటికప్పడు కీలకమైన వ్యూహాలు చెప్తూ చెన్నైని ముందుకు తీసుకువెళ్లేందుకు మాస్టర్ మైండ్ ధోనీ అండగా ఉండటంతో టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రుతురాజ్ కు కెప్టెన్ గా ఇది రెండో సీజన్ కావడం కొంత ప్లస్ పాయింట్. ఇక బెంగళూర్ కొత్త కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రజత్ పాటిదార్.. టీమ్ ను ఎలా లీడ్ చేస్తాడనేది చూడాలి. 

పిచ్.. టీమ్స్ బలాలు:

చెపాక్ పిచ్ చెన్నైకి అనుకూలంగా అంటే స్పిన్ కు అనుకూలంగా ఉండటం కామన్. ఈ పిచ్ లో బెంగళూర్ స్పిన్నర్స్ కృనాల్ పాండ్య, సుయాశ్ శర్మ పిచ్ ను ఎలా అనుకూలంగా మార్చుకుంటారో చూడాలి. ఇక చెన్నై విషయానికి వస్తే.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ వంటి స్పిన్నర్స్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. పిచ్ ఛేజింగ్ కు అనుకూలించనుంది. పిచ్ ఛేజింగ్ కు అనుకూలించనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

చెపాక్ స్టేడియంలో జరిగే ఈ పోరులో సీఎస్కే ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. ఇరు జట్లూ లీగ్‌‌‌‌‌‌‌‌లో తమ ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో గెలిచి జోరు మీద ఉన్నాయి.  ఇదే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన తొలి పోరులో సీఎస్కే 6 వికెట్ల తేడాతో ముంబైని ఓడించగా, ఆర్సీబీ.. కోల్‌‌‌‌‌‌‌‌కతాపై గెలిచి ఫుల్ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ముంబైతో పోరులో పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖలీల్ అహ్మద్‌‌‌‌‌‌‌‌తో పాటు స్పిన్నర్లు  నూర్ అహ్మద్, జడేజా, అశ్విన్, కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో రచిన్, కెప్టెన్ రుతురాజ్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. మరోవైపు ఆర్సీబీలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీలతో దుమ్మురేపారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో క్రునాల్ ఆకట్టుకున్నాడు. 

ఇక బ్యాటింగ్ లో బెంగళూర్ కు ఓపెనింగ్ జోడి విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరికి తోడుగా కెప్టెన్ రజత్ పాటిదార్ తో పాటు లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ పవర్ హిట్టింగ్ భారీ స్కోర్ కు ఛాన్సెస్ ఇస్తున్నాయి. అదే క్రమంలో చెన్నై కి రుతురాజ్ మంచి ఓపెనింగ్ ఇస్తాడనేది అంచనా. దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి మంచి స్టెబిలిటీ ఇస్తారని ఎనలిస్ట్ లు అంటున్నారు. చూడాలి మరి.. రెండు హెవీ వెయిట్స్ మధ్య మ్యాచ్ ఎలా ఉంటుందో.