
చెన్నై: ఐపీఎల్–18వ సీజన్‌లో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లు చెన్నై, బెంగళూరు శుక్రవారం జరిగే హై ఓల్టేజ్ పోరులో తలపడనున్నాయి. చెపాక్ స్టేడియంలో జరిగే ఈ పోరులో సీఎస్కే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇరు జట్లూ లీగ్‌లో తమ ఆరంభ మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీద ఉన్నాయి.
ఇదే గ్రౌండ్‌లో జరిగిన తొలి పోరులో సీఎస్కే 6 వికెట్ల తేడాతో ముంబైని ఓడించగా, ఆర్సీబీ.. కోల్‌కతాపై గెలిచి ఫుల్ జోష్‌లో ఉంది. ముంబైతో పోరులో పేసర్ ఖలీల్ అహ్మద్‌తో పాటు స్పిన్నర్లు నూర్ అహ్మద్, జడేజా, అశ్విన్, కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌లో రచిన్, కెప్టెన్ రుతురాజ్ ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు ఆర్సీబీలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, కోహ్లీ తొలి మ్యాచ్‌లో ఫిఫ్టీలతో దుమ్మురేపారు. బౌలింగ్‌లో క్రునాల్ ఆకట్టుకున్నాడు.