మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడనే విషయంపై గత కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. భారత క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్ లో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే వస్తున్న నివేదికల ప్రకారం ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని తెలుస్తుంది. క్రికెట్ లవర్ నుంచి ఎక్స్ పర్ట్స్ వరకు ఇదే విషయాన్ని బల్లగుద్ది చెబుతున్నారు. కెప్టెన్సీని గుడ్ బై చెప్పడం.. మోకాలి గాయం.. వచ్చే ఏడాది మెగా ఆక్షన్ ఉండడం లాంటి అంశాలు మహేంద్రుడి రిటైర్మెంట్ పై మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
ప్రస్తుతం 42 ఏళ్ళ వయసులో ఉన్న మహీ 2025 ఐపీఎల్ సీజన్ ఆడతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించగానే మరోసారి మహేంద్రుడి రిటైర్మెంట్ చర్చ తెర మీదకు వచ్చింది. ఈ విషయంపై తాజాగా చెన్నై యాజమాన్యం ఒక క్లారిటీ ఇచ్చారు. ధోనీ తన రిటైర్మెంట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. మరో సీజన్ ఆడతాడా లేదా అనే విషయం ఎవరికీ చెప్పలేదని చెన్నై సూపర్ కింగ్స్ అధికారులలో ఒకరు తెలిపారు.
ధోనీ తన రిటైర్మెంట్ పై తుది నిర్ణయం మరో రెండు నెలల్లో తీసుకుంటాడని చెన్నై యాజమాన్యానికి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ధోనీ తన స్వస్థలం రాంచీకి వెళ్లిన సంగతి తెలిసిందే. చివరి లీగ్ మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే కీలకమైన మ్యాచ్ లో చెన్నై 27 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ధోనీ 13 బంతుల్లో 25 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. మరో 5 బంతుల్లో 11 పరుగులు చేస్తే చెన్నై ప్లే ఆఫ్ కు వెళ్తుందనుకున్న దశలో ధోనీ ఔట్ కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు.
MS DHONI HAS NOT TOLD ANYONE THAT HE'S QUITTING.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2024
- He'll make a decision in the coming few months. (TOI). pic.twitter.com/LNZTcJ7Ew1