సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టెస్ట్ 2024 టెస్ట్ బుధవారం జరగాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఢిల్లీ సెంట్రర్ లో మాత్రమే వాయిదా పడింది. మే 15న జరగాల్సిన CUET-UG కొంతమంది అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ కాకుండా సర్వర్ ఇష్యూ వచ్చింది. దీంతో పరీక్ష వాయిదా పడింది. దేశవ్యాప్తంగా అన్ని ఇతర నగరాల్లో ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి.
పరీక్షకు ఒక్కరోజు ముందే ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం నిర్వహిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఢిల్లీ అభ్యర్ధుల వరకు మే 29కి రీషెడ్యూల్ చేశారు. దీని వల్ల అప్డేటెడ్ అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి. CUET-UG కోసం ఢిల్లీలో 258 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.