భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేయడమే లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మలేషియాలో ఆయిల్ పామే ప్రధానమైన పంట అని అన్నారు. ఇక్కడి కంటే మనవే సారవంతమైన భూములని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. అశ్వారావుపేట రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరికీ అన్యాయం జరగొద్దని స్థానిక అధికారులకూ మంత్రి సూచించారు. భూ వివాదాల్లో జోయం చేసుకుంటున్న దమ్మపేట ఎస్సైపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ : తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో భారీగా బదిలీలు : 70 మంది అధికారుల ట్రాన్సఫర్లు