ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో నాగులవంచ గ్రామంలో నడి ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతూ సరఫరా చేస్తూ యువతను గంజాయి మత్తులో దింపుతున్న ఓ ప్రభుద్ధుడి వ్యవహారం గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... కందిమల్ల వెంకటేశ్వర్లు ఆయన కుమారుడు కందిమల్ల శ్రీహరి ఇద్దరూ తన ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారు.
గంజాయి మొక్కలను పెంచడమే కాకుండా దాన్ని యువకులకు సరఫరా చేస్తూ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. చాలా ఏళ్లుగా గంజాయి మొక్కలను ఇంట్లోనే పెంచుతూ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. కందిమల్ల వెంకటేశ్వర్లుపై ఆరోపణలు రావడంతో నిఘా పెట్టిన పోలీస్ యంత్రాంగం ఎట్టకేలకు పక్కా సమాచారంతో పట్టుకొని స్టేషన్ కు తరిలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై షేక్ నాగుల్ మీరా, కానిస్టేబుళ్లు ఉన్నారు.