పెరిగిన పంట ఖర్చులు..రైతులకు కాడెడ్ల ఖర్చులు భారం

కామారెడ్డి, వెలుగు: యాసంగి పంటల సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులే కాదు.. చివరకు కాడెద్దుల కిరాయి కూడా పెరిగిపోయింది. మరో వైపు సాగు నీటి వనరులు తక్కువగా ఉండే  ఏరియాల్లో బోర్లకు డిమాండ్ ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ఏరియాలో ఇది మరీ ఎక్కువైంది. యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లాలో 4,23,042 ఎకరాల్లో పంటలు సాగుకు అగ్రికల్చర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇందులో ఇప్పటికే లక్ష ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. శనగ పంట 90,125 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా ఒక జుక్కల్ నియోజకవర్గంలోనే 50 వేల ఎకరాల వరకు వేస్తారు. ట్రాక్టర్ కిరాయిలు ఎక్కువ కావడంతో విత్తనాలు వేసేందుకు రైతులు అరక వైపు మొగ్గు చూపుతున్నారు. జుక్కల్, మద్నూర్, బిచ్కుంద మండలాల్లో అరక అద్దెలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో ఎకరాకు రూ. 800 నుంచి రూ.వెయ్యి వరకు తీసుకునే వారు. ఈసారి  రూ.1200 నుంచి రూ.1300 వరకు తీసుకుంటున్నారు. మూడెకరాల్లో శనగ విత్తనాలు వేసేందుకు  రెండు అరకలకు కలిపి రూ.7,200 కిరాయి అవుతోంది. 

తక్కువ నీటితో...

జుక్కల్ నియోజకవర్గంలో సాగు నీటి వనరులు తక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాల కొరత ఉంది. చిన్న తరహా కౌలాస్​ ప్రాజెక్టు ద్వారా కొంత ప్రాంతానికే సాగునీరు అందుతుంది.   ఈ పరిస్థితుల్లో ఉన్న కొద్ది పాటి బోరు నీళ్లు, వాగుల్లో ఉన్న నీళ్లతో ఆరు తడి పంటలు సాగు చేస్తారు. మక్క, జొన్న, శనగ, పల్లి పంటలు వేస్తున్నారు. బోర్లు లేని రైతులు సమీపంలో బోర్లను కిరాయికి తీసుకుంటున్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంట వేసినప్పటి నుంచి  కోతకు వచ్చే వరకు బోరుకు రూ.2 వేలు చెల్లించాలి. తక్కువ నీళ్లలో ఎక్కువ విస్తీర్ణంలో  పంటల సాగు చేసేందుకు కొందరు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. జుక్కల్ మండలంలో ఏ గ్రామ శివారులో చూసిన ఇవే కనిపిస్తున్నాయి.  

తక్కువ నీళ్లతోఎక్కువ  పంట

నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇందులో పల్లి వేస్తున్నా. ఇప్పటికే సగం వేసిన. తక్కువ నీళ్లతో ఎక్కువ పంట సాగు చేయాలని స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకున్నా. .
- మాధవరావు, వజ్రకండి

అరక కిరాయికి తీసుకున్నం

నాకున్న మూడెకరాల్లో మక్క, పల్లి పంటలు వేస్తున్నా. అరక కిరాయి తీసుకుని దున్నించా. రోజుకు  రూ.2 వేల కిరాయి తీసుకున్నారు. బోర్లు లేని వాళ్లు పక్క రైతుల బోర్​నుంచి నీళ్లు తీసుకుని స్ప్రింక్లర్లతో పారిస్తున్నారు.
-  సుధాకర్​,  సోపూర్