- గత రెండు సీజన్లకు చెందిన
- 3.34 లక్షల టన్నులు పెండింగ్
- జిల్లాలో రోజుకు 6 వేల టన్నుల మిల్లింగ్ కెపాసిటీ
- సప్లయ్ చేసేది 2 వేల టన్నులే
- 35 మిల్లుల్లో ఇంకా సీఎంఆర్షురూ చేయలే
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ నత్తనడకను సాగుతుంది. సీఎంఆర్ సేకరణకు గవర్నమెంట్ఎన్నిసార్లు డెడ్‌లైన్ విధించినా మిల్లర్లలో చలనం రావడం లేదు. 2023–24 ఖరీఫ్‌లో సేకరించిన 4.75 లక్షల మెట్రిక్‌టన్నుల వడ్లను ఇంకా టచ్ చేయకపోగా, 2022–23 రెండు సీజన్లకు సంబంధించి 3.34 లక్షల టన్నుల రైస్ఎఫ్ సీఐకి చేరాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు వంద శాతం సీఎంఆర్ కంప్లీట్ చేయాలని సివిల్ సప్లయ్మినిస్టర్ఉత్తమ్ కుమార్‌రెడ్డి 8వ తారీకున వీడియో కన్ఫరెన్స్లో జిల్లా ఆఫీసర్లను ఆదేశించారు. ఆ మరుసటి రోజు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మిల్లర్లతో మీటింగ్ పెట్టి త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు.
తనిఖీల వైఫల్యమే..
సివిల్‌సప్లయ్ ఆఫీసర్లు 2022–23 ఖరీఫ్‌లో 6.3 లక్షల మెట్రిక్‌టన్నుల వడ్లు సేకరించారు. వీటిని కస్టం మిల్లింగ్ కోసం 280 రైస్‌మిల్లులకు పంపారు. మిల్లింగ్ చేసి 4.9 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి చేర్చాలి. ఇప్పటికీ 22 వేల టన్నుల బియ్యం బాకీ ఉంది. అదే ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 6.35 లక్షల టన్నుల వడ్లను రైతుల నుంచి కొనుగోలు చేసి 242 రైస్ మిల్స్‌కు పంపారు. 4.32 లక్షల టన్నుల రైస్ సప్లయ్ కావాల్సి ఉండగా, కేవలం 1.20 లక్షల టన్నుల బియ్యం మాత్రమే చేరింది. ఇంకా 3.12 లక్షల టన్నులు పంపాలి.
రెండు సీజన్లకు కలిపి 3.34 లక్షల టన్నుల రైస్ఎఫ్సీఐకి చేరాలి. ప్రతీ 15 రోజులకోసారి సీఎంఆర్వడ్ల స్టాక్‌ను సివిల్ సప్లయ్ఆఫీసర్లు తనిఖీ చేసి, గడువులో గా బియ్యం రవాణా అయ్యేలా చూడాల్సి ఉంది. కానీ వారి నిర్లక్ష్యం కారణంగా మిల్లర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.35 మంది మిల్లర్లు గింజ బియ్యం ఇవ్వలేసీఎంఆర్ విషయంలో గవర్నమెంట్ సీరియస్‌గా ఉన్నా దాదాపు 35 రైస్‌మిల్స్ నుంచి గింజ బియ్యం రాలేదు. వాళ్లు సీఎంఆర్ స్టార్టే చేయలేదు. వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ నెల 9న కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సివిల్‌సప్లయ్ ఆఫీసర్లను ఆదేశించారు.
కెపాసిటీ ఉన్నా సప్లయ్ లేదు
జిల్లాలోని మిల్లర్లకు ప్రతిరోజు 6 వేల టన్నుల రైస్ సప్లయ్ చేసే కెపాసిటీ ఉంది. కానీ కేవలం 2 వేల టన్నులు మాత్రమే తోలుతున్నారు. మార్కెట్ మిల్లింగ్ బంద్ చేసి సీఎంఆర్‌పైనే దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆదేశించినా అందుకనుగుణంగా నడుచుకోవడం లేదు. దీంతో మిల్లర్ల వద్ద గవర్నమెంట్ ఇచ్చిన వడ్లు ఉన్నాయా? లేదా? అనే డౌట్ షురువైంది.
గడువులోగా సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల నుంచి వడ్ల విలువలో 25 శాతం పెనాల్టీ వసూలు చేసే పవర్ ఆఫీసర్లకు ఉంది. వడ్లను పక్కదారి పట్టిస్తే ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. ఈ నెలాఖరుకు వంద శాతం సీఎంఆర్ పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసింది. మిల్లుల పూర్తి కెపాసిటీ ప్రకారం రోజుకు 6 వేల టన్నుల బియ్యం పంపినా మిగిలిన 19 రోజుల్లో 1.8 లక్షల టన్నుల రైస్మాత్రమే ఎఫ్‌సీఐకి చేరుతాయి.
మిల్లర్లు ఒక రోజులో పంపుతున్న 2 వేల టన్నుల ప్రకారం 38 వేల టన్నులు బియ్యం సప్లయ్ అవుతుంది. ఏరకంగా చూసినా విధించిన గడువులోగా 3.34 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి చేరడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఆఫీసర్లు మరింత సీరియస్‌గా వ్యవహరిస్తే గానీ పరిస్థితిలో పురోగతి ఉండదు. 2023–24 ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన 4.75 లక్షల టన్నుల వడ్లు ఇంకా ముట్టే పరిస్థితి రాలేదు.