ఉత్సాహంగా స్ప్రింగ్ స్ప్రీ.. ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ సందడి

ఉత్సాహంగా స్ప్రింగ్ స్ప్రీ.. ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ సందడి

కాజీపేట, వెలుగు: వరంగల్​ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. స్టూడెంట్ల ఈవెంట్లతో సందడిగా మారింది. రెండో రోజు స్టూడెంట్లు పలు ఈవెంట్లను ప్రదర్శించారు. తెలుగు సినిమా మ్యాడ్ స్వ్కేర్ బృందం సభ్యులు ఎన్ఐటీ క్యాంపస్‏ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. రాత్రి నేపథ్య గాయని గీతామాధురి పాటలు పాడి అలరించారు. రాత్రి కొరియో నైట్ పోటీ జరిగింది. వాల్యూ ఎడ్యుకేషన్  క్లబ్, ఎన్ఎస్ఎస్  ఆధ్వర్యంలో హ్యాండ్  ప్రింటింగ్  వేశారు. 

కుండల తయారీ, యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్నేక్స్  అండ్  లాడర్స్, మేజ్  రన్ (ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని మిగతావారికి మార్గం చూపే) గేమ్ చూపించారు. నిఘా, విచారణ ఆధారంగా నడిచే డిటెక్టివ్  గేమ్, స్ట్రీ ట్, పోలరాయిడ్  ఫొటోగ్రఫీ నిర్వహించారు. ఆర్ట్  థెరపీ పెయింటింగ్  క్లబ్, తానాబానా ఏక్  భారత్, శ్రేష్ట భారత్  సంప్రదాయ వంటకాలు, వస్త్రధారణ పద్దతులపై అవగాహన పెంచే ప్రదర్శనలు ఇచ్చారు. ట్రెజర్  హంట్  లిటరరీ, డిబేట్  క్లబ్  సాంస్కృతిక విషయాలపై స్కావెంజర్  హంట్, పెయింట్  బాల్  పోటీ నిర్వహించారు.