పర్వతగిరి మండలంలో క్వాలిటీ లేకుండా కల్వర్టు నిర్మాణం 

పర్వతగిరి మండలంలో క్వాలిటీ లేకుండా కల్వర్టు నిర్మాణం 

పర్వతగిరి, వెలుగు : వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం జమాల్​పురం శివారు డబుల్​బెడ్​రూం ఇండ్ల వద్ద బొందివాగుపై నిర్మిస్తున్న కల్వర్లు పనుల్లో నాణ్యత కరువైంది. కల్వర్టు, రెండువైపులా 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరవగా, కాంట్రాక్టర్​ పైపుల కింద బేస్​కు క్యూరింగ్​ చేయకుండానే పనులు కానిచ్చేస్తున్నారని, నాణ్యత లేకుండా చేసే పనులతో కల్వర్టు కొద్దిరోజులకే కూలిపోయే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు డైవర్షన్​ రోడ్డు కూడా సరిగా రోలింగ్​ చేయకపోవడంతో భారీ వాహనాలు రోడ్డుపై దిగబడిపోయి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమైన ఆర్​అండ్​బీ ఏఈ రత్నశేఖర్​ను వివరణ కోరగా ప్రస్తుతం చేసిన పనులకు ఇంకా బిల్లు చేయలేదని, పనులకుటాక్స్​పర్మిట్​సీజన్​ఆప్రూవల్​ రాలేదని కాంట్రాక్టర్​ను పనులు చేయవద్దని చెప్పామన్నారు.