ఎడపల్లి మండలంలో కల్వర్టు పనులు తవ్వారు.. వదిలేశారు

ఎడపల్లి మండలంలో కల్వర్టు పనులు తవ్వారు.. వదిలేశారు

ఎడపల్లి, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి, జైతాపూర్ మధ్య కల్వర్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ధ్వంసమైన పాత కల్వర్టు స్థానంలో కొత్తది నిర్మించాలని నాలుగు నెలల కింద పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్ నాలుగు పైపులు వేశారు. మరో రెండు పైపులు వేస్తే రోడ్డు వెడల్పు అవుతుంది. 

కానీ ఈ పనులు మధ్యలోనే వదిలేశారు. దీంతో ఆయా గ్రామస్తులు 5 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పనులు పూర్తి చేసి ఇబ్బంది తొలగించాలని కోరుతున్నారు.