T20 World Cup 2024: వెస్టిండీస్ చేరుకోవడానికి ఆసీస్ క్రికెటర్ల కష్టాలు.. బ్యాగ్ పోగొట్టుకున్న కమ్మిన్స్

T20 World Cup 2024: వెస్టిండీస్ చేరుకోవడానికి ఆసీస్ క్రికెటర్ల కష్టాలు.. బ్యాగ్ పోగొట్టుకున్న కమ్మిన్స్

టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. 2023 లో వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ గెలిచిన కంగారూల జట్టు మరో ఐసీసీ ట్రోఫీపై కన్నేసింది. ఇప్పటికే ఆసీస్ క్రికెటర్లు ప్రపంచ ఐకేపీ కోసం వెస్టిండీస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో ఐపీఎల్ ఆడిన స్టార్ ఆస్ట్రేలియా క్రికెటర్లు తాజాగా వెస్టిండీస్ లోని బార్బడోస్ చేరుకున్నారు. సెర్ప్ ప్రయాణం అంత సజావుగా సాగలేదని తెలుస్తుంది. 

పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ మరియు ఆల్-రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ బార్బడోస్‌లో జట్టులో చేరడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారని నివేదికలు చెబుతున్నాయి.  ఆసీస్ క్రికెటర్లు రెండు రోజుల ప్రయాణం తర్వాత బార్బడోస్ చేరుకున్నారు. అయితే దారి మధ్యలో ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తన లగేజ్ పోగొట్టుకున్నదంటూ గుర్తించాడట. స్టార్క్, మాక్స్‌వెల్ ఫ్లయిట్ ఆలస్యం కావడంతో లాస్ ఏంజిల్స్ లోని మయామిలో రాత్రిపూట బస చేశారట. 

జూన్ 6న ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో ఒమన్‌తో  తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ బ్రిడ్జ్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాతో పాటు ఈ గ్రూప్ లో ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్ ఉన్నాయి. వార్మప్ మ్యాచ్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన ఆసీస్.. నమీబియాతో విజయం సాధించింది.