IPL వేలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టాపిక్

IPL వేలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టాపిక్

IPL 2024 ఆటగాళ్లకు జరిగిన వేలం పాట.. జోరుగా సాగింది. ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు పంతానికి వెళ్లి.. ఐపీఎల్ చరిత్రలో.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్.. క్రికెటర్ పాట్ కమిన్స్ ను 20 కోట్ల 50 లక్షలకు దక్కించుకుంది. ఈ ధర చూసి.. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే చేసిన కామెంట్ తో.. ఐపీఎల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరల ప్రస్తావన వచ్చింది.. 

ఐపీఎల్ లో 20 కోట్ల 50 లక్షలు దక్కించుకున్న పాట్ కమిన్స్ ను ట్యాగ్ చేస్తూ.. సిడ్నీలో రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయి పాట్ కమిన్స్ అంటూ కామెంట్ చేశారు హర్ష బోగ్లే.. 

ఈ కామెంట్ కు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం స్పందించింది. సిడ్నీలో రియల్ ఎస్టేట్ ధరలు తెలియదు కానీ.. హైదరాబాద్ బంజారాహిల్స్ చాలా మనోహరంగా.. సుందరంగా ఉంటుందని వింటున్నాం అంటూ పాట్ కమిన్స్ తరపున రిప్లయ్ ఇచ్చింది. 60 రోజులకు 20 కోట్ల 50 లక్షల రూపాయలు తీసుకుంటున్న కమిన్స్.. ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయటానికి రియల్ ఎస్టేట్ బెస్ట్ అనే అభిప్రాయంలో ఉన్నారని హర్ష  బోగ్లే ట్విట్ తో స్పష్టం అయ్యింది. మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధరలు.. ఐపీఎల్ వేలంతో తెరపైకి వచ్చింది.

పాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టులోకి రావటంపై.. హైదరాబాద్ క్రికెట్ అభిమానులు స్పందించారు. వెల్ కం టూ హైదరాబాద్ అని కొందరు అంటే.. ఆరంజ్ టీం ఈసారి ఐపీఎల్ కప్ గెలవటం ఖాయం అని కామెంట్ చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ గా.. హైదరాబాద్ కు ఈసారి ఐపీఎల్ కప్ తీసుకొస్తాడని.. సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని హైదరాబాద్ క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..