ఐపీఎల్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సత్తా చూపిస్తున్నాడు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. మయాంక్ అగర్వాల్ గాయపడడంతో చివరి రెండు మ్యాచ్ ల్లో ఈ తెలుగు కుర్రాడికి తుది జట్టులో స్థానం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సిక్స్ తో మ్యాచ్ ముగించగా.. ఈ మ్యాచ్ లో తనను తాను నిరూపించుకోవడానికి పెద్దగా అవకాశం రాలేదు. అయితే నిన్న (ఏప్రిల్ 9) చంఢీగర్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టాప్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. ఎంతో పరిణితి ఆటగాడిలా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 20 ఏళ్ల నితీశ్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులతో (4ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా రాణించడంతో పాటు బంతితో కూడా ఆకట్టుకున్నాడు. చివర్లో జితేష్ శర్మ వికెట్ లాంటి కీలక వికెట్ తీసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లతో ఆకట్టుకొని సన్ రైజర్స్ కు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఈ తెలుగు కుర్రాడి ఆటకు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఫిదా అయ్యాడు.
నితీశ్ రెడ్డి సన్ రైజర్స్ జట్టుకు సూపర్ స్టార్ అని కొనియాడాడు. అతను ఓ అద్భుతమైన ఆటగాడని.. అతని ఇన్నింగ్స్ కారణంగా మేము 180 పరుగుల మార్క్ ను అందుకున్నాం అని కమ్మిన్స్ తెలిపాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌తో గెలుపులో కీలక పాత్ర పోషించాడని మ్యాచ్ అనంతరం ఈ ఆసీస్ సారధి అన్నాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ పై సన్ రైజర్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Pat Cummins' Instagram story for Nitish Reddy.
— CricketMAN2 (@ImTanujSingh) April 10, 2024
- Nitish, The Superstar for SRH. ⭐ pic.twitter.com/FATEMHWthq