సిడ్నీ: వచ్చే నెలలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు పాట్ కమిన్స్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. కమిన్స్‌తో పాటు గాయంతో ఇబ్బందిపడుతున్న పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ను ఆసీస్ సెలెక్టర్లు ఫిబ్రవరి 19 నుంచి జరిగే ఈ ట్రోఫీకి ఎంపిక చేశారు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో కమిన్స్ చీలమండ సమస్యతో ఇబ్బందిపడ్డాడు. దాంతో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. గాయం కారణంగా సిడ్నీ టెస్టుకు దూరమైన హేజిల్‌వుడ్ కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నాడు.
ఫామ్ కోల్పోయిన కారణంగా ఇండియాతో ఐదో టెస్టు నుంచి తప్పించిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా 15 మందితో కూడిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్లు మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీని టీమ్‌లోకి తీసుకున్న సెలెక్టర్లు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడమ్ జంపాను ఎంపిక చేశారు. ఈ టోర్నీలో ఆసీస్ గ్రూప్–బిలో అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాతో కలిసి బరిలోకి దిగనుంది.
ఆస్ట్రేలియా టీమ్: కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నేథన్ ఎలిస్, ఆరోన్ హార్డీ, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, స్టోయినిస్, ఆడమ్ జంపా.