‌IND vs AUS 3rd Test: ఆకాష్ దీప్‌పై కమ్మిన్స్ రివెంజ్.. ఫోర్, సిక్సర్‌తో ఇచ్చిపడేశాడు

‌IND vs AUS 3rd Test: ఆకాష్ దీప్‌పై కమ్మిన్స్ రివెంజ్.. ఫోర్, సిక్సర్‌తో ఇచ్చిపడేశాడు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య రసవత్తరంగా జరుగుతుంది. ఇరు జట్లు మాత్రమే కాదు ఆటగాళ్ల మధ్య వార్ కొనసాగుతుంది. బ్రిస్బేన్ వేదికగా గబ్బా వేదికగా ముగిసిన టెస్టులో డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్ లో ఇద్దరి ఆటగాళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా అనిపించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ల మధ్య బ్యాటింగ్ వార్ నడిచింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆకాష్ దీప్ చివర్లో అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. 

ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే భారత్ మరో నాలుగు పరుగులు చేయాల్సిన దశలో కమ్మిన్స్ బౌలింగ్ లో ఆకాష్ దీప్ థర్డ్ మ్యాన్ దిశగా ఫోర్ కొట్టాడు. ఈ బౌండరీతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. ఐదో రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 16 ఓవర్లో ఆకాష్ దీప్ బౌలింగ్ లో కమ్మిన్స్ వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ముగిసిన ఈ టెస్టులో ఐదో రోజు వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రా గా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 275 పరుగుల లక్ష్యంతో చివరి రోజు బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 2.1 ఓవర్లు మాత్రమే ఆడింది. ఈ దశలో వర్షం రావడంతో అంపైర్లు టీ విరామం ఇచ్చారు. టీ బ్రేక్ తర్వాత వర్షం తగ్గకపోవడంతో ఇరు జట్లు డ్రా కు అంగీకరించారు. మ్యాచ్ డ్రా కావడంతో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-1 తో సమంగా నిలిచాయి.