
హైదరాబాద్, వెలుగు : దివ్యశ్రీ గ్రూప్ ఆల్టర్నేటివ్ హౌసింగ్ కంపెనీకి చెందిన క్యూరేటెడ్ లివింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌లో తన మొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. రెండు దశల్లో 500 పడకలతో కూడిన ప్రాజెక్ట్‌ను ఇక్కడ నిర్మిస్తారు. ఒకటో ఫేజ్‌లో ఎకరం క్యాంపస్‌లో 50 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన 250 బెడ్స్‌ను ఇది డెలివరీ చేసింది.
ఏఎంటీజెడ్ ఆవరణలో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, ఏఎంటీజెడ్ విద్యార్థుల కోసం ఈ వసతి సదుపాయాన్ని నిర్మించారు. ఇక్కడ భూమిని ఏఎంటీజెడ్ లీజు కమ్ సేల్ ప్రాతిపదికన కేటాయించింది. క్యూరేటెడ్ లివింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, డెహ్రాడూన్, దుర్గాపూర్‌లో కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్, ఇండస్ట్రియల్ హౌసింగ్‌కు సంబంధించిన పది వేల బెడ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.