దేశంలో గణేశ్ నవరాత్రుల సందడి కొనసాగుతుంది. ఎవరికి తోచినట్టు వారు ఆ లంబోదరుడిని కొలుచుకుంటున్నారు. కొందరు పూలు, పండ్లతో ప్రత్యేకంగా మండపాలను అలంకరిస్తుంటే.. మరికొందరు కూరగాయలతో గణపతి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో కొలువైన గణనాథుడిని కోట్ల రూపాయల కరెన్సీతో అలంకరించారు.
ALSO READ |వినాయకుడి నిమజ్జనంలో చేయకూడని తప్పులు ఇవే...
మంగళగిగిరి మెయిన్ బజార్లో దశావతారంలో కొలువైన గణనాథుడు ని వ్యాపారులు రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో ముస్తాబు చేశారు. 18 ఏళ్ల క్రితం ఐదు లక్షలతో అలంకరించడం ప్రారంభించిన వ్యాపారులు క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. ఈ ఏడాది రెండు కోట్ల 20 లక్షలతో అలంకరించామని మండపం నిర్వహకులు సంకా బాలాజీ గుప్తా చెప్పారు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేశారు. గణపతిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు.
మంగళగిరిలో 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడు
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2023
ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ. pic.twitter.com/ICRUGOfy5i
గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో వినాయక చవితిని పురస్కరించుకొని వ్యాపారస్తులు, ఎస్ బి జి యూత్, ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని మంగళవారం సుమారు రెండు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు.ఆర్గనైజర్స్ మాట్లాడుతూ 17 సంవత్సరాల నుంచి మెయిన్ బజార్లో ప్రతి ఏడాది చవితికి వినాయకున్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయడం జరుగుతుందని, ఉత్సవాల్లో వ్యాపారస్తుల సహకారంతో ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారం చేయడం జరుగుతుందన్నారు.
తొలి ఏడాది 5 లక్షల రూపాయలు కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకారం ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది రెండు కోట్ల 20 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడిని అలంకరించినట్లు తెలిపారు.