ముంబై: స్టార్ సింబల్‌తో కూడిన కరెన్సీ నోట్లు చెల్లుతాయని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అలాంటి కరెన్సీ నోట్లపై ఎలాంటి భయాలూ అవసరం లేదని పేర్కొంది. స్టార్ సింబల్ఉన్న కరెన్సీ నోట్లు చెల్లవంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై ఆర్బీఐ ఈ క్లారిఫికేషన్ ఇచ్చింది.
కొన్ని కరెన్సీ నోట్లపై సీరియల్ నెంబర్‌కు ముందు స్టార్ సింబల్ చోటు చేసుకుంటోందని, డిఫెక్టివ్ నోట్లను రిప్లేస్ చేసేందుకు ఈ సింబల్‌ను చేర్చినట్లు వివరణ ఇచ్చింది. రిప్లేస్మెంట్ నోట్లను గుర్తించేందుకే ఆ స్టార్ సింబల్ వాడుతున్నట్లు పేర్కొంది.