ఇండియా లో కొద్దిగా పెరిగిన కరెంటు ఖాతా లోటు

ఇండియా లో  కొద్దిగా పెరిగిన  కరెంటు ఖాతా లోటు

ముంబై:   మనదేశ  కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది జూన్​ క్వార్టర్​లో జీడీపీలో 1.1 శాతం లేదా 9.7 బిలియన్ డాలర్లు పెరిగిందని ఆర్​బీఐ తెలిపింది. ఏడాది క్రితం కాలంలో ఇది ఒక శాతంగా ఉందని సోమవారం ప్రకటించింది. జనవరి-మార్చి క్వార్టర్​లో నమోదైన 4.6 బిలియన్ డాలర్ల మిగులు (జీడీపీలో 0.5 శాతం) కారణంగా దేశం బాహ్య రంగ బలం పెరిగింది.   రిజర్వ్ బ్యాంక్ కరెంట్ ఖాతా లోటు 2025 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో  65.1 బిలియన్ డాలర్లు నమోదైంది.

ఇది క్రితం సంవత్సరం ఇదే కాలంలో  56.7 బిలియన్ డాలర్లుగా ఉంది. జూన్​ క్వార్టర్​లో నికర సేవల వసూళ్లు 35.1 బిలియన్ డాలర్ల నుంచి 39.7 బిలియన్ డాలర్లకు పెరిగాయని, కంప్యూటర్ సేవలు, వ్యాపార సేవలు, ప్రయాణ సేవలు,  రవాణా సేవలు పెరిగాయని ఆర్‌‌‌‌బీఐ తెలిపింది. దిగుమతులు, ఎగుమతుల మధ్య అంతరాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.