స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024
జైపూర్‌లో అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దివాస్ సందర్భంగా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2024 ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచింది. సూరత్(గుజరాత్) టాప్‌లో ఉంది. 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో.. రాయ్‌బరేలి(ఉత్తర్‌ప్రదేశ్), నల్గొండ( తెలంగాణ) తొలి రెండు స్థానాల్లో ఉండగా, సంగారెడ్డి 8వ స్థానంలో ఉంది.
హైదరాబాద్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్
అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. గ్లోబల్ సమ్మిట్ లో ఏఐ రోడ్ మ్యాప్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
యుద్ధ్ అభ్యాస్ స్టార్ట్
భారతదేశం-–అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం 20వ ఎడిషన్, యుద్ధ్ అభ్యాస్ 2024, రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్‌లో ప్రారంభమైంది. సెప్టెంబరు 22 వరకు జరుగుతుంది.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ (సైమా) - 2024 వేడుక దుబాయ్ వేదికగా జరిగింది. 2023 సంవత్సరంలో సత్తా చాటిన సినిమాలు, నటీనటులు, చిత్ర బృందాలకు పురస్కారాలు అందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ నిలిచింది. ఉత్తమ నటుడిగా నాని (దసరా) , నటిగా కీర్తి సురేశ్(దసరా), దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల (దసరా), సహాయ నటుడిగా దీక్షిత్ శెట్టి పురస్కారాలు దక్కించుకున్నారు.
మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు గుర్తుండేలా కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెడుతున్నామని సీఎం ఆమె వర్ధంతి సభలో వెల్లడించారు.
తెలంగాణలో కంటెయినర్ పాఠశాల
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో రాష్ట్రంలోనే తొలి కంటెయినర్ పాఠశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతి లేకపోవడంతో ఈ ఏర్పాటు చేశారు.
అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్‌వాక్
అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్ నిర్వహించిన తొలివ్యక్తిగా బిలియనీర్ జేర్డ్ ఐజక్‌మన్ చరిత్ర సృష్టించి, క్షేమంగా భూమికి చేరుకున్నారు. పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్-9 రాకెట్ ద్వారా నలుగురు వ్యక్తులను స్పేస్‌ఎక్స్ నింగిలోకి పంపింది.
యుఎస్ ఓపెన్ చాంపియన్స్
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఫైనల్లో సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్‌పై గెలుపొందాడు. మహిళల ఫైనల్లో బెలారస్ అమ్మాయి సబలెంకా 7-–5, 7–-5తో ఆరోసీడ్ జెస్సికా పెగులా(అమెరికా)ను ఓడించి టైటిల్ నెగ్గింది.
ముగిసిన పారాలింపిక్స్
పన్నెండు రోజులు జరిగిన పారాలింపిక్స్ పారిస్‌లో ముగిశాయి. టోక్యో క్రీడల మాదిరే చైనా (220) పతకాలతో టాప్‌లో నిలిచింది. బ్రిటన్ 124 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా (36 స్వర్ణాలు సహా 105) మూడో స్థానం సాధించింది. భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది.
ఆపరేషన్ సద్భావ్‌తో ఆపన్నహస్తం
భారీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ సద్భావ్’ పేరుతో ఆ దేశాలకు తక్షణావసర సామగ్రిని పంపించింది.
వెలుగు సక్సెస్