పోటీ పరీక్షల ప్రత్యేకం.. కరెంట్​ అఫైర్స్​

పోటీ పరీక్షల ప్రత్యేకం.. కరెంట్​ అఫైర్స్​

నేషనల్

పంజాబ్‌‌‌‌‌‌‌‌లో వర్సిటీలకు చాన్స్​లర్​గా సీఎం

పంజాబ్‌‌‌‌‌‌‌‌ శాసనసభ రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్స్​లర్​గా గవర్నర్ల స్థానంలో సీఎం ఉంటారనే బిల్లు సభామోదం పొందింది. డీజీపీ ఎంపికలో యూపీఎస్సీ పాత్రను తప్పించేలా మరో బిల్లు పంజాబ్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఆమోదించింది.

గీతాప్రెస్‌‌‌‌‌‌‌‌కు గాంధీ శాంతి బహుమతి

ఉత్తర్‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని గోరఖ్‌‌‌‌‌‌‌‌పుర్‌‌‌‌‌‌‌‌కు చెందిన గీతాప్రెస్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం 2021 గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. ఆ సంస్థకు అవార్డు కింద రూ. కోటి నగదు, జ్ఞాపిక అందించనుంది. .1995లో కేంద్ర ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని ఏర్పాటు చేసింది.
 ‘జీ 20’ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సమ్మిట్​
నాణ్యమైన డేటా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో సాంకేతిక ప్రజాస్వామీకరణ ముఖ్య సాధనమని ప్రధాని మోడీ జూన్​ 12న వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మంత్రుల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రసంగించారు.
అంతర్జాతీయ ‘గ్రీన్‌‌‌‌‌‌‌‌ యాపిల్‌‌‌‌‌‌‌‌’ పురస్కారాలు
లండన్‌‌‌‌‌‌‌‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌ తెలంగాణలోని అయిదు నిర్మాణాలను ‘గ్రీన్‌‌‌‌‌‌‌‌ యాపిల్‌‌‌‌‌‌‌‌’ పురస్కారాలకు ఎంపిక చేసింది. ధార్మిక విభాగాల కేటగిరీలో యాదాద్రి, అందమైన ఆఫీస్​ బిల్డింగ్​ విభాగంలో సెక్రటేరియట్​, ప్రత్యేక కార్యాలయ అంశంలో పోలీసు కమాండ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్, వారసత్వ విభాగంలో మొజంజాహి మార్కెట్, దుర్గం చెరువు కేబుల్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిని వంతెనల విభాగంలో ఎంపిక చేసింది.

వ్యక్తులు

అమిత్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌
ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డులు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ - ఉడాయ్‌‌‌‌‌‌‌‌) సీఈవోగా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారి అమిత్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఆయన ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఐటీ మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 
రవి సిన్హా
భారత గూఢచర్య విభాగమైన రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎనాలిసిస్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌ (రా)కు నూతన అధిపతిగా సీనియర్‌‌‌‌‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారి రవిసిన్హా నియమితులయ్యారు. 59 ఏళ్ల సిన్హా నియామకాన్ని మంత్రి మండలి నియామకాల కమిటీ ఆమోదించింది. 
స్వామినాథన్‌‌‌‌‌‌‌‌ జానకీరామన్‌‌‌‌‌‌‌‌
రిజర్వ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) డిప్యూటీ గవర్నరుగా స్వామినాథన్‌‌‌‌‌‌‌‌ జానకీరామన్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు మైఖేల్‌‌‌‌‌‌‌‌ దేవవత్ర పాత్ర, ఎం.రాజేశ్వరరావు, టి.రవి శంకర్‌‌‌‌‌‌‌‌ ఉండగా, నాలుగో డిప్యూటీ గవర్నరుగా స్వామినాథన్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు చేపట్టనున్నారు.
శరవణన్‌‌‌‌‌‌‌‌
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌) చైర్మన్, మేనేజింగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ (సీఎండీ)గా యు.శరవణన్‌‌‌‌‌‌‌‌ నియమితులయ్యారు.
ఎన్‌‌‌‌‌‌‌‌.గోపి
ప్రొఫెసర్​ కొత్తపల్లి జయశంకర్‌‌‌‌‌‌‌‌ విశిష్ట సాహితీ పురస్కారానికి ప్రొఫెసర్ ఎన్‌‌‌‌‌‌‌‌.గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన సాహితీమూర్తులకు ఇకపై ఏటా ఈ పురస్కారం అందజేస్తామని భారత జాగృతి తెలిపింది. గోపి ఇప్పటివరకు 56 పుస్తకాలు రచించారు.

తెలంగాణ

‘ముడుమాల్‌‌‌‌‌‌‌‌’ యునెస్కో గుర్తింపు
నారాయణపేట జిల్లా ముడుమాల్‌‌‌‌‌‌‌‌లోని పురాతన, చారిత్రక గుర్తింపు ఉన్న మెన్హిర్స్‌‌‌‌‌‌‌‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపునకు తెలంగాణ పురావస్తు శాఖ, దక్కన్‌‌‌‌‌‌‌‌ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ అకాడమీ ట్రస్టుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 
‘రెరా’ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా సత్యనారాయణ 
రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్​గా ఎన్‌‌‌‌‌‌‌‌. సత్యనారాయణను  రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

సైన్స్ అండ్ టెక్నాలజి

ఇరాన్‌‌‌‌‌‌‌‌ హైపర్​ సోనిక్​ మిస్సైల్ 
ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్‌‌‌‌‌‌‌‌సోనిక్‌‌‌‌‌‌‌‌ క్షిపణిని ఇరాన్​ రూపొందించింది. ఈ క్షిపణికి ‘ఫత్తా’ అని పేరు పెట్టారు.  ఇది 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.

ఇంటర్నెషనల్

ఐక్యరాజ్యసమితిలో యోగా దినోత్సవం
జూన్​ 21న తొమ్మిదో యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితి వేదికపై ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోని అత్యధిక దేశస్థులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌లోనూ చోటు సంపాదించింది. యోగా విశ్వవ్యాప్తమని, దానికి పేటెంట్‌‌‌‌‌‌‌‌లేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

యునెస్కోలోకి మళ్లీ అమెరికా
యునెస్కోలో చైనా పలుకుబడి తగ్గించేందుకే అమెరికా మరోసారి అందులోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. కృత్రిమ మేథ, సాంకేతిక విద్య వంటి అంశాల్లో యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా పాటించే ప్రమాణాలు, విధాన నిర్ణయాలను తనకు అనువుగా మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఆమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికా స్పెల్లింగ్‌‌‌‌‌‌‌‌ బీ విజేతగా దేవ్‌‌‌‌‌‌‌‌షా
అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్‌‌‌‌‌‌‌‌ స్పెల్లింగ్‌‌‌‌‌‌‌‌ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌‌‌‌‌‌‌‌షా చాంపియన్​గా నిలిచాడు. శామాఫైల్‌‌‌‌‌‌‌‌ అనే పదానికి స్పెల్లింగ్‌‌‌‌‌‌‌‌ చెప్పి 50 వేల డాలర్లు గెలుచుకున్నాడు. శామాఫైల్‌‌‌‌‌‌‌‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే జీవి.