
భారత జంట సాకేత్ మైనేని-యుకి బాంబ్రి రఫా నాదల్ ఓపెన్‌లో విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్ - యుకి 6-2, 6-2తో మారెక్ - లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. ఈ సీజన్లో భారత జంటకు ఇది అయిదో ఛాలెంజర్ టైటిల్.
డైమండ్ లీగ్ ట్రోఫీ
డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. ఫైనల్లో జావెలిన్‌ను 88.44 మీటర్లు విసిరిన నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు.
బ్రిటన్‌ను అధిగమించిన భారత్
బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (854.7 బిలియన్ డాలర్లు)గా తాజాగా అవతరించిన భారత్ 2029 నాటికల్లా మూడో స్థానానికి చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలే భారత్ కంటే ముందున్నాయి.
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్
కొవిడ్ చికిత్సకోసం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా (నాసల్ వ్యాక్సిన్) ఇన్‌కొవ్యాక్ (బీబీవీ154)కు మన దేశంలో అత్యవసర వినియోగ అనుమతి లభించింది. దీన్ని ముక్కు ద్వారా ఇస్తారు. ఈ తరహా కొవిడ్- టీకా ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం విశేషం.
నౌకాదళం సరికొత్త పతాకావిష్కరణ
నౌకాదళానికి సరికొత్త పతాకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. కొత్త పతాకంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో జాతీయ జెండాను ఉంచారు. కుడి వైపున నీలం, బంగారు వర్ణంలో మెరిసిపోయే అష్టభుజాకారం ఉంది.
భారత సైన్యాధిపతికి నేపాల్ గౌరవం
నేపాల్ అధ్యక్షురాలు బైద్య దేవీ భండారి తమ దేశ గౌరవ జనరల్ హోదాను భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండేకు ప్రదానం చేశారు.
జస్టిస్ డి.వై.చంద్రచూడ్
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీజేఐ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించడం సంప్రదాయంగా వస్తోంది.
సైరస్ మిస్త్రీ
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జూన్‌లో సైరస్ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ చనిపోయారు.
విన్ ఓవెన్
బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్‌గా గారెత్ విన్ ఓవెన్ హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, ఏపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
కల్యాణ్ చౌబే
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో బైచుంగ్ భుటియాపై ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే విజయం సాధించాడు.
అరవింద్ చిదంబరం
భారత గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీ విజేతగా నిలిచాడు. 9 రౌండ్లలో 7.5 పాయింట్లతో అతడు అగ్రస్థానం సంపాదించాడు. ఏడుగురు భారతీయులు టాప్-10లో నిలవడం విశేషం.
మానవాభివృద్ధి సూచీలో 132వ స్థానం
ఆరోగ్యం, విద్య, సగటు ఆదాయం అనే మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకొని గణించిన మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)–2021లో 0.633 హెచ్‌డీఐ విలువతో భారత్ 132వ స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరంలో 131వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానం దిగజారింది.
మ్యాక్స్ వెర్‌స్టాపెన్
ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఈ సీజన్‌లో తన కెరీర్‌లోనే తొలిసారి వరుసగా నాలుగో గ్రాండ్ ప్రి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డచ్ గ్రాండ్ ప్రి రేసులో ఈ బెల్జియం రేసర్ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్ పాయింట్లలో తన ఆధిక్యాన్ని 109 పాయింట్లకు పెంచుకున్నాడు.
యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్
యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో వరంగల్ చేరినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు.
కాళోజీ అవార్డ్
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అవార్డ్ 2022కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ ఎంపికయ్యారు. ఈ అవార్డ్ కింద రూ.1,00,116 నగదుతో పాటు షీల్డ్‌ను అందించారు.
ఐఎన్‌ఎస్ విక్రాంత్ జలప్రవేశం
దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక నౌక ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డులో జలప్రవేశం చేసింది. భారత నైపుణ్యాలు, ప్రతిభకు ఈ యుద్ధనౌక సాక్ష్యంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఐఎన్‌ఎస్ విక్రాంత్ జలప్రవేశం
దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక నౌక ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డులో జలప్రవేశం చేసింది. భారత నైపుణ్యాలు, ప్రతిభకు ఈ యుద్ధనౌక సాక్ష్యంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
కుషియారా జలాలపై ఒప్పందం
మన దేశంలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌హసీనా భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–బంగ్లాదేశ్‌ల మధ్య ఏడు కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. వాటిలో దక్షిణ అసోం, బంగ్లాదేశ్‌లోని సిల్హేట్ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉన్న కుషియారా నదీ జలాలపై ఒప్పందం కుదిరింది.
బ్రిటన్ రాజుగా ఛార్లెస్
బ్రిటన్‌ను 70 ఏళ్ల పాటు పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో మరణించారు. రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు.