వాట్సాప్‎లో కరెంట్ బిల్ ఇలా కట్టేయొచ్చు..!

వాట్సాప్‎లో కరెంట్ బిల్ ఇలా కట్టేయొచ్చు..!

వా ట్సాప్​పేలో డిజిటల్ పేమెంట్స్ చేయడం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత అప్​డేట్ అయింది. అదేంటంటే.. వాట్సాప్​పేలో బిల్​పేమెంట్స్ అనే కొత్త ఫీచర్​ఇండియాలో తీసుకురాబోతున్నారని మెటా కంపెనీ తెలిపింది. ఇది అచ్చం యూపీఐ లానే పనిచేస్తుందట. ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్​బీటా వెర్షన్ 2.25.3.15లో ఈ ఫీచర్ ఉంది. ప్రస్తుతం వాట్సాప్​యూజర్లు వాళ్ల కాంటాక్ట్స్‎లో ఉన్నవాళ్లకు మనీ సెండ్​చేయగలుగుతున్నాం. 

అయితే బిల్ పేమెంట్స్​ఫీచర్​ వచ్చాక, ఎలక్ట్రిసిటీ బిల్, మొబైల్ ప్రీ–పెయిడ్​రీచార్జ్‎లు, ఎల్​పీజీ గ్యాస్ పేమెంట్స్, వాటర్ బిల్, లాండ్ లైన్ పోస్ట్​ పెయిడ్ బిల్, రెంట్ వంటివి ఈజీగా కట్టొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్​మెంట్ స్టేజీలో ఉంది. ఈ ఫీచర్‎గాని అందుబాటులోకి వస్తే ఫోన్​పే, గూగుల్ పే యాప్స్‎కు గట్టిపోటీ ఇస్తుందట!