- సబ్‌స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన
కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలం పలుగడ్డ తండాలోని ఇళ్ల గోడలకు గురువారం రాత్రి కరెంట్ షాక్ రావడంతో బాధితులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి గోడలు, వస్తువులకు టెస్టర్ పెట్టి చూడగా కరెంట్ సప్లై చూపించింది. ఫీడర్ఆఫ్ చేసే ప్రయత్నం చేయగా శ్రీనివాస్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.
దీంతో తండా వాసులంతా సమీపంలోని కొండాపూర్సబ్స్టేషన్కు వద్ద ఆందోళనకు దిగారు. ఫీడర్ వద్ద ఎర్తింగ్ ప్రాబ్లమ్‌తో సమస్య తలెత్తినట్లు ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. సబ్‌స్టేషన్‌లో సప్లై నిలిపి వేసి సమస్యను క్లియర్ చేశారు. గాయపడిన శ్రీనివాస్‌ను జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.