ఇవ్వాళ మెదక్​ పట్టణంలో కరెంట్​ బంద్​

ఇవ్వాళ మెదక్​ పట్టణంలో కరెంట్​ బంద్​

మెదక్ టౌన్, వెలుగు:  మెదక్​ జిల్లా కేంద్రంలోని 132 కేవీ విద్యుత్​ సబ్​స్టేషన్​లో మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో శనివారం పట్టణంలో విద్యుత్​సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని మెదక్​ ట్రాన్స్​కో  ఏడీఈ మోహన్​బాబు, టౌన్​ ఏఈ జావేద్​ శుక్రవారం  తెలిపారు.

శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలో కరెంట్​ సరఫరా నిలిపివేస్తామన్నారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని  కోరారు.