కరెంట్ ట్రాన్స్​ ఫార్మర్లు పగుల గొట్టి..కాపర్​ వైర్​ఎత్తుకెళ్లిండ్రు

బచ్చన్నపేట,వెలుగు: మూడు కరెంట్​ ట్రాన్స్​ఫార్లర్లు పగులగొట్టి కాపర్​ వైర్​ చోరీ చేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున ఆలింపూర్​ గ్రామంలో జరిగింది. రైతులు, కరెంట్​ ఆఫీసర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్​ గ్రామంలో రైతుల వ్యవసాయ మోటార్లకు కరెంట్​ సరఫరా కోసం మూడు 25కేవీ ట్రాన్స్​ఫార్మర్లు ఫిట్​ చేశారు.  

దొంగలు వాటిని   పగులగొట్టి   సుమారు రూ. 2 లక్షల విలువైన కాపర్​ వైర్​ను చోరీచేశారు. బచ్చన్నపేట ఎస్సై సతీశ్​​ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇదే గ్రామంలో రెండు రోజుల కింద ఓ వ్యవసాయ మోటార్​, పైపులు ఎత్తుకెళ్లారు. ఓ రైతు ఇంటి ముందు పెట్టిన బైకును సైతం చోరీచేశారు. మండలంలో  తరచు కాపర్​ వైర్​ చోరీలు జరుగుతున్నా దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఈనెల రోజుల్లో  పోచన్నపేట, నారాయణపూర్​, చిన్నరామచర్లలతోపాటు పలు గ్రామల్లో రైతుల వ్యవసాయ మోటర్ల వద్ద కేబుల్​ కట్​చేసి కాపార్​ వైర్​ చోరీకి పాల్పడ్డారు. ఇప్పటికీ ఒక్క దొంగకూడ పట్టుపడలేదు.