ఆల్ టైం హైకు చేరిన కరెంట్ వాడకం.. ఉమ్మడి ఏపీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం

  • రాష్ట్రంలో కరెంటు మస్తు వాడుతున్నం
  • శనివారం ఆల్ టైం పీక్ డిమాండ్
  • 13,252 మెగావాట్లు నమోదు
  • రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ ఇదే టాప్‌
  • ఫిబ్రవరిలో 14 వేల మెగావాట్లు దాటే చాన్స్‌‌
  • ప్రాజెక్టుల అవసరాలకే 2,200 మెగావాట్ల వాడకం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరెంటు డిమాండ్‌‌లో ఆల్‌‌ టైమ్‌‌ రికార్డు నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఏపీలోని హయ్యెస్ట్‌ డిమాండ్‌‌కు మించి కరెంటు వాడకం శనివారం రికార్డయింది. 13,252 మెగావాట్ల డిమాండ్‌‌ నమోదై.. పోయిన ఏడాది ఫిబ్రవరి 28న రికార్డయిన 13,168 మెగావాట్లను దాటింది. ఉమ్మడి ఏపీలో 2014 మార్చి 23న అత్యధికంగా 13,162 మెగావాట్ల కరెంటు వాడగా.. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంతకుమించి డిమాండ్‌‌ నమోదైంది. పోయినేడాది జనవరి 30న రాష్ట్రంలో పీక్ డిమాండ్ 11,300 మెగావాట్లే. యాసంగి సాగు పెరగడంతో అగ్రికల్చర్‌‌ సెక్టర్‌‌లో కరెంటు వాడకం పెరుగుతోంది.

వ్యవసాయానికి ఎక్కువగా..

రాష్ట్రం ఏర్పడే నాటికి 19.02 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉంటే ఇప్పుడు అవి 24.31 లక్షలకు పెరిగాయి. అనధికార కనెక్షన్లతో కలిపి 25.50 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రెండేండ్లుగా మంచి వర్షాలు పడి బావులు, బోర్లు, చెరువుల్లో నీళ్లు ఉండటంతో సాగుకు కరెంటు వాడకం పెరిగింది. భీమా, నెట్టెంపాడు, కోయిల్​సాగర్, కల్వకుర్తి, దేవాదుల, కాళేశ్వరం లింక్–1, 2 ప్రాజెక్టుల్లో నీటి లిఫ్టింగ్‌‌కు కరెంటు ​వాడుతున్నారు. యాసంగి సాగు పెరిగినందున ఫిబ్రవరి, మార్చిల్లో కరెంటు వాడకం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2014లో ఎత్తిపోతల పథకాలకు 680 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా..  పంపుహౌజ్‌‌లలో పంపింగ్‌‌ స్టార్టవడంతో 2,200 మెగావాట్ల కరెంటు అవసరం అవుతోంది.

కనెక్షన్లు 40 లక్షలు పెరిగినయ్‌‌

-రాష్ట్రంలో అర్బనైజేషన్ పెరుగుతుడడంతో కమర్షియల్ కరెంటు కనెక్షన్లు పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం కరెంటు కనెక్షన్లు 1.11 కోట్లు ఉంటే ఇప్పుడవి 1.54 కోట్లకు చేరాయి.

ఎండాకాలం 14 వేలు దాటుతది

ఎండాకాలం స్టార్టవకముందే రాష్ట్రంలో కరెంటు డిమాండ్‌‌ పెరుగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యాసంగి పంటలకు కరెంటు వినియోగం పెరిగే చాన్స్‌ ఉంది. ఎండాకాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరుగుతుంది. దీంతో ఫిబ్రవరి తొలివారం నుంచి కరెంటు వినియోగం 14 వేల మెగావాట్లు దాటుతుందని చెబుతున్నారు.

దేశంలోనూ ఆల్‌‌ టైమ్‌‌ రికార్డు

న్యూఢిల్లీ: ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండు 189.6 గిగావాట్లను తాకింది. జనవరి 28న రికార్డయిన ఆల్ టైమ్ హై 188.4 గిగావాట్స్‌‌ను దాటిపోయింది. ఎలక్ట్రిసిటీ డిమాండ్‌‌తో పాటు రిఫైనరీలు, జీఎస్టీ కలెక్షన్లు, రైల్వే రవాణా పెరుగుతుండటంతో ఎకానమీ రికవర్‌‌ అవుతోందని తెలుస్తోంది. 2020 సెప్టెంబర్ నుంచి ఎలక్ట్రిసిటీ సెక్టార్ పాజిటివ్ గ్రోత్‌‌ను రికార్డు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో ఎలక్ట్రిసిటీ, కన్‌‌స్ట్రక్షన్ రంగాలు 7.1 శాతం, 4.4 శాతంతో ‘వీ’ షేప్ రికవరీని రిజిస్టర్ చేస్తున్నాయని అంచనాలున్నాయి. నిరంతరం కరెంట్‌ సప్లైకు, డిస్కమ్‌‌లను ఆదుకునేందుకు సరికొత్త స్కీమ్‌‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. కేంద్ర బడ్జెట్‌‌లో దీన్ని ప్రకటించే అవకాశముంది.

For More News..

నేటి నుంచి రేషన్‌కు బయోమెట్రిక్ బంద్

భర్తను చంపినా.. భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందే