ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పలువురు నిందితుల జ్యూడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబుల ఈడీ జ్యూడీషియల్ కస్టడీ ముగిసింది. ప్రస్తుతం వీరంతా తీహార్ జైల్లో ఉన్నారు. వీరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 

నిందితుల బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరిపింది. నిందితుడు బినయ్ బాబు బెయిల్ విచారణ కేసు జనవరి 9కి వాయిదా వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ల విచారణను జనవరి 4కు కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. గత నెల నవంబర్ 10న మనీ లాండరింగ్ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబును ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.