కవిత, కేజ్రీవాల్‌‌‌‌ కస్టడీ పొడిగింపు

కవిత, కేజ్రీవాల్‌‌‌‌ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కాంలో తీహార్‌‌‌‌‌‌‌‌లో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని రౌస్‌‌‌‌ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా జైల్‌‌‌‌ నుంచి కేజ్రీవాల్, కవితను వర్చువల్ మోడ్‌‌‌‌లో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.

కవిత తరఫు న్యాయవాది మోహిత్‌‌‌‌ రావు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు సంస్థలు సాక్ష్యుల వాంగ్మూలాలను నమోదు చేసిన సమయంలో రికార్డు చేసిన వీడియో పుటేజీలు తమకివ్వాలని కోరారు. సాక్ష్యులపై ఒత్తిడి తెచ్చి కవితపై తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేశారని ఆరోపించారు.

పీఎంఎల్ఏలోని సెక్షన్ 50 ప్రకారం దర్యాప్తు సంస్థ నమోదు చేసిన వాంగ్మూలాల్లో నిజం లేదని చెప్పారు. ఈడీ తరఫు అడ్వొకేట్ ఈ వాదనలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఇరు వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.