కూకట్పల్లి, వెలుగు : కరెంట్బిల్లు కట్టమన్నందుకు ఆగ్రహించిన అన్నదమ్ములు విద్యుత్‌శాఖ ఉద్యోగిపై దాడి చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ రెండో రోడ్డులోని ఈడబ్ల్యూఎస్ప్లాట్నంబర్109లో నివసించే వినియోగదారులు కొంతకాలంగా బిల్లు కట్టలేదు. దీంతో విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న బండారు శ్యామ్ శుక్రవారంవారి ఇంటికి వెళ్లాడు.
కరెంట్బిల్లు ఓవర్‌డ్యూ ఉందని, వెంటనే కట్టకపోతే కనెక్షన్కట్చేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆ ఇంట్లోని అన్నదమ్ములు హుస్సేన్(37), రంజాన్(34) శ్యామ్‌పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.