ప్రస్టేషన్ పీక్ : షోరూం ఎదుటే.. తన ఓలా బైక్ కు అంత్యక్రియలు

ప్రస్టేషన్ పీక్ : షోరూం ఎదుటే.. తన ఓలా బైక్ కు అంత్యక్రియలు

ఎలక్ట్రికల్​ బైక్స్​కు ఎంత ఆదరణ పెరుగుతుందో... అంతే స్థాయిలో విమర్శలు కూడా వస్తాయి.  ముంబై ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనుగోలు చేసిన వ్యక్తి ... అది పెట్టే ఇబ్బందులు భరించలేక షోరూం ఎదుట నిరసన తెలిపి.. తన ఓలా బైక్​కు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఓ విషాద గీతాన్ని ఆలపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. 

ఓలా స్కూటర్​ యజమాని  తన స్కూటర్​ ను బండిపై కట్టి షోరూం ఎదుటకు తీసుకెళ్లి.. లౌడ్​ స్పీకర్​ ద్వారా తన బాధను వ్యక్తపరిచాడు.  ఈ ఘటనను చూస్తున్న రోడ్డుపై వెళుతున్న వారు అక్కడికక్కడే ఆగిపోయారు.    ఉల్లాసమైన సాంగ్​ పాడుతూ తన బైక్​కు అంత్యక్రియలు చేయడానికి ఇలా తీసుకొచ్చానని చెప్పాడు. ఎలక్ట్రిక్ స్కూటర్‌తో నిండిన బండిని పార్క్ చేసిన వ్యక్తి  హమ్ దిల్ దే చుకే సనమ్‌లోని 'విచారకరమైన పాటకు అనుకరణగా పాడటం ప్రారంభించాడు . అతను తడప్ తడప్ కే ఇస్ దిల్ సే ఆహ్ నికల్తీ రాహి, ముజ్కో సాజా ది ఓలా నే ఐసా క్యా గునాహ్ కియా జో లుట్ గయే హా లుట్ గయే జో లుట్ గయే హమ్ ఓలా లేకర్ కే అని పాడాడు .

ఈ సంఘటనను చూసేందుకు .. ఈ  పాటను వినడానికి ప్రజలు అక్కడికక్కడే గుమిగూడారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు పట్ల కస్టమర్ అసంతృప్తితో ఉన్నారని...  ఎలక్ట్రికల్​  బైక్​ ను అమ్మిన తరువాత  కంపెనీ పట్టించుకోలేదని వాపోయాడు.  వెహికల్​ సరిగా పనిచేయడం లేదని అనేక సార్లు కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలా అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. 

ఎలక్ట్రిక్ స్కూటర్లలో  మంటలు రావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  కొన్నింటిలో బ్యాటరీ పేలి అనేక మంది గాయపడిన ఘటనలు కూడా జరిగాయి.  అయిన ఓలా ఎలక్ట్రికల్​ బైక్​ లు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందనలను పొందింది.  చాలామందికష్టమర్లు ఈ ఎలక్ట్రికల్​ బైక్​ ల పనితీరు.. కంపెనీ అందించే సేవలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని ఈ వీడియోను చూస్తే అర్దమవుతుంది.