
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరం కాల్వ ఒడ్డులోని ఓ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్అమ్ముతన్నారని కస్టమర్లు బుధవారం ఆందోళన చేశారు. జానీ అనే వ్యక్తి తన టూ వీలర్ లో పెట్రోల్ పోయించుకోగా బండి స్టార్ట్ కాలేదు. వెంటనే ట్యాంక్లోని పెట్రోల్ను బయటికి తీసి చూడగా ఆయిల్ లో నీళ్లు వచ్చాయి. వెంటనే అతడు మరికొంతమంది కస్టమర్లతో కలిసి బంక్ వద్ద ఆందోళన చేశాడు. బంక్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.