Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం

Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో బంగారం, వెండి ధరలు ఎలా ఉండనున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. బడ్జెట్ ప్రభావం గోల్డ్, సిల్వర్ పైన ఎలా ఉండనుందనే ప్రశ్నలు సామాన్యులలో నెలకొన్నాయి. 

బడ్జెట్ లో భాగంగా గోల్డ్, సిల్వర్ పై కస్టమ్ డ్యూటీ 15 నుంచి 6 శాతానికి తగ్గించారు. దేశంలో బంగారం, వెండి లిక్విడిటీ పెంచేందుకు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీంతో రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో బంగారం, వెండికి డిమాండ్ పెరగనుంది. 

కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో వ్యాపారులు ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవడం, అదే సందర్భంలో జ్యువెలరీ రూపంలో ఎగమతులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో దేశంలో గోల్డ్ కు డిమాండ్  మరింత పెరుగుతుంది. కస్టమ్స్ సుంకం తగ్గించడంతో ఇల్లీగల్ దిగుమతులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 

అదే విధంగా మెటీరియల్ కాస్ట్ తగ్గనుండటంతో బంగారం ధరలు తగ్గి దేశీయంగా బంగారం వినియోగం పెరగనుంది.

గోల్డ్ స్టాక్స్ అయిన కల్యాణ్ జ్యువెలర్స్, టైటాన్ తదితర కంపెనీల షేర్లకు పాజిటివ్. 

బడ్జెట్ రోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో గోల్డ్ రేట్స్:

24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ ధర 160 రూపాయలు పెరిగి రూ.84,490 దగ్గర ఉంది.
22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ ధర 150 రూపాయలు పెరిగి రూ.77,450 గా ఉంది. 

హైదరాబాద్ లో సిల్వర్ రేట్స్:

హైదరాబాద్ లో సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 1 కేజీ వెండి ధర రూ. 1,07,000  గా ఉంది.