![15 కిలోల గోల్డ్ సీజ్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఇదే అత్యధికం](https://static.v6velugu.com/uploads/2023/02/Shamshabad-airport_TnrcgB5dfW.jpg)
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా పట్టుబడింది. దాదాపు 14.906 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ లో హైదరాబాద్ ఎయిర్ ఇంటలీజెన్స్ యూనిట్, ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. సుడాన్ నుంచి షార్జా మీదుగా విమానంలో వచ్చిన 23 మంది ప్రయాణికులను తనిఖీ చేయగా భారీగా బంగారం పట్టుబడింది. దీని విలువ రూ. 7.90 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బూట్లు, బట్టల మడతల కింద ప్లాస్టిక్ లో చుట్టి బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన అధికారులు మిగతా వారిని విచారిస్తున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీజ్ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని తెలిపారు.