శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గోల్డ్ స్వాధీనం

రంగారెడ్డి జిల్లా : ఇటీవల అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీగా పట్టుకుంటున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న గోల్డ్ ను సీజ్ చేశారు శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు. ఇద్దరు ప్రయాణికులు (వేర్వురుగా) దుబాయ్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా బంగారం తీసుకొస్తుండగా ఎయిర్ పోర్టులో పట్టుబడ్డారు.

ఒక ప్రయాణికుడు వద్ద నుంచి 810 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడి వద్ద నుంచి 717 గ్రాముల బంగారం సీజ్ చేశారు. ఇద్దరు నిందితులు కూడా గోల్డ్ ను తమ లో దుస్తుల్లో తీసుకొస్తుండగా... కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ బంగారం విలువ దాదాపు రూ. 93.26 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.