
హైదరాబాద్: దోహ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రయాణికుడి వద్ద 19 వందల గ్రాముల బంగారాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 40 లక్షలుగా ఉంటుందని అధికారులు చెప్పారు..