చైనా నుంచి భారీగా లగ్జరీ వాచీలు, అడల్ట్ టాయ్స్ స్మగ్లింగ్.. రూ. 13 కోట్ల సరుకు సీజ్

చైనా నుంచి భారీగా లగ్జరీ వాచీలు, అడల్ట్ టాయ్స్ స్మగ్లింగ్.. రూ. 13 కోట్ల సరుకు సీజ్

చైనా నుంచి భారీగా స్మగ్లింగ్ చేస్తున్న లగ్జరీ వాచీలు, అడల్ట్ టాయ్స్, చెప్పులు చెన్నై ఎయిర్పోర్ట్ లో సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సీజ్ చేసిన మొత్తం వస్తువుల విలువ రూ. 13.4 కోట్లు ఉన్నట్లు తెలిపారు అధికారులు. సోమవారం ( ఏప్రిల్ 14 ) జరిపిన వేర్వేరు తనిఖీల్లో వాచీలు, అడల్ట్ టాయ్స్ తో పాటు పెద్ద ఎత్తున చెప్పులు, కాస్మటిక్స్, స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 

ఈ వస్తువులన్నిటిని వుడెన్ డిస్పోజబుల్ స్పూన్లుగా పేర్కొని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు చైనా నుంచి వస్తున్న కంటైనర్ ను తనిఖీ చేసి ఈ మేరకు అక్రమంగా తరలిస్తున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న వస్తువులన్నీ వుడెన్ స్పూన్లు, బ్యాక్ పాక్ లు, ట్రాలీ బ్యాగులుగా పేర్కొని అదికారులను తప్పుదోవ పట్టించే ప్లాన్  చేశారు దుండగులు. మొత్తం మూడు కంటైనర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు సీజ్ చేసిన వస్తువుల విలువ రూ.9.03 కోట్లు ఉన్నట్లు తెలిపారు అధికారులు.