పెన్షనర్లకు మాత్రం రెండు వాయిదాల్లో జమ
లాక్ డౌన్ టైంలో కట్‌చేసిన ఉద్యోగుల జీతాలపై సర్కర్ నిర్ణయం
తిరిగి చెల్లింపుపై జీవో జారీ
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ టైంలో కట్ చేసిన జీతాలను నాలుగు వాయిదాల్లో తిరిగి చెల్లించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నెలల జీతాలతో కలిపి చెల్లిస్తామని.. పెన్షనర్లకు మాత్రం అక్టోబర్, నవంబర్ పెన్షన్ తో కలిపి రెండు వాయిదాల్లోనే చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా టైంలో రాష్ట్రానికి ఇన్‌కం తగ్గిపోయిందంటూ.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగులకు 50% జీతం, పెన్షనర్లకు 25 %పెన్షన్ ను సర్కారు కట్ చేసింది. ఈ మూడు నెలల్లో కట్ చేసిన మొత్తాన్ని ఇప్పుడు తిరిగి చెల్లించనున్నారు.
డీఏ కూడా మంజూరు చేయాలి..
కట్ చేసిన జీతాలను తిరిగి చెల్లించే జీవో విడుదల చేయడంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్, మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ గౌడ్ తదితరులు ప్రకటన విడుదల చేశారు. కొద్దిరోజుల్లో దసరా పండుగ ఉన్నందున పెండింగ్ లో ఉన్న రెండు డీఏలను కూడా విడుదల చేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు.
For More News..