Vijay devarakonda: విజయ్ మైక్కి బిర్యానీలో లెగ్ పీస్కి లింక్ పెట్టేసిన బుడ్డది

Vijay devarakonda: విజయ్ మైక్కి బిర్యానీలో లెగ్ పీస్కి లింక్ పెట్టేసిన బుడ్డది

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, ఫోలివింగ్ ను ఏర్పరుచుకున్నాడు. లైగర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.. కానీ, ఆ సినిమా బిగెస్ట్ ప్లాప్ అవడంతో ఆ ఫేమ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు విజయ్. 

ఇదిలా ఉంటే.. సినిమా ఈవెంట్స్ లో స్టేజిపై విజయ్ మాట్లాడే మాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ గా తాను చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్పేస్తుంటాడు విజయ్. ఆక్రమంలో కొన్నిసార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. ఇక విజయ్ స్టేజిపై మాట్లాడేటప్పుడు తాను మైక్ పట్టుకునే విధానం కూడా వింతగా ఉంటుంది. అందరిలా ముందు కాకుండా.. మైక్ ని ఓపక్కకి ఎత్తి పట్టుకొని మాట్లాడతాడు విజయ్. ఎందుకు అలా అనేది తెలుసుకోవడానికి చాలా మంది ట్రై చేశారు. 

ఇదే విషయంపై తాజాగా ఒక చిన్న పాప సోషల్ మీడియాలో ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో పాప తన నాన్నని.. అందరిలా కాకుండా విజయ్ దేవరకొండ మింక్ ను పైకి పట్టుకుంటాడు ఎందుకో చెప్పు.. అడుగుతుంది. దానికి పాప నాన్న.. నాకు తెలియదు నువ్వే చెప్పు అంటాడు. అప్పుడు ఆ పాప.. ఎందుకంటే విజయ్‌ దేవరకొండకు బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి. బిర్యానీలో లెగ్‌ పీస్‌ను అలానే పట్టుకుని తింటాం కదా.. అందుకే విజయ్‌ మైక్‌ని అలా పట్టుకుంటాడు.. అని చెప్పుకొచ్చింది.

Also Read:ఆసుపత్రిలో చేరిన హీరో అజిత్ భార్య షాలిని.. కారణం ఏంటంటే? 

ఆ పాప వీడియోకి స్పందించిన విజయ్.. అవును ఆర్య.. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను మైక్‌ ను ఎందుకు అలా పట్టుకుంటానో నాకు కూడా తెలియదు. బహుశా అడ్డు రాకుండా కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందని కావొచ్చు. నువ్వు చెప్పిన ఆన్సర్‌ నాకు చాలా నచ్చింది.. లవ్‌ యూ ఆర్య.. రిప్లయ్ ఇచ్చాడు విజయ్. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ రిప్లయ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.