హైదరాబాద్, వెలుగు: క్యూటిస్ ఇంటర్నేషనల్ హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరించింది. నాణ్యమైన సంరక్షణ అధునాతన పరిష్కారాలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ షాజీర్ మాచించేరీ చెప్పారు. నాణ్యత ప్రమాణాలు, రోగి భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరీ శంకర్ పేర్కొన్నారు.
జుట్టు చర్మ సమస్యలతో బాధపడుతున్న ఎవరికైనా సరసమైన ధరలలో ఉత్తమ చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చారు. క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్కు యూకే, దుబాయ్, షార్జా, మస్కట్లో బ్రాంచులు ఉన్నాయన్నారు. ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ లాస్ చికిత్సలు, స్కిన్, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయని పేర్కొన్నారు.