తప్పు చేస్తే కాళ్లు, చేతులు నరికేస్తాం

కాబూల్: అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబాన్లు అంటే అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మహిళల్ని చదువుకోవడానికి నిరాకరించిన తాలిబాన్లు.. మున్ముందు ఇంకెన్ని హక్కులను కాలరాస్తోరోననే సందేహాలు, భయాలు నెలకొన్నాయి. 90వ దశకంలో అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తే కఠిన శిక్షలు అమలు చేసిన తాలిబాన్లు.. మళ్లీ దాన్నే రిపీట్ చేసేలా ఉన్నారు. తప్పు చేస్తే చేతులు నరికేస్తాం అంటూ తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్ తురాబీ చేసిన వ్యాఖ్యలు వీటికి ఊతం ఇస్తున్నాయి. 

‘గతంలో మేం బహిరంగంగా శిక్షలు అమలు చేసినప్పుడు చాలా దేశాలు మాపై విమర్శలు గుప్పించాయి. కానీ అలా విమర్శించిన దేశాల చట్టాలు, శిక్షల గురించి మేం ఎప్పుడూ కామెంట్ చేయలేదు. కాబట్టి మా దేశ చట్టాల గురించి మాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మేం ఇస్లాంను అనుసరిస్తాం. ఖురాన్‌ ప్రకారమే మా చట్టాలు ఉంటాయి. దేశ భద్రత దృష్ట్యా కాళ్లు, చేతులు నరికేయడం లాంటి శిక్షల అవసరం చాలా ఉంది. దీనికి సంబంధించిన పాలసీపై మేం పని చేస్తున్నాం’ అని తురాబీ స్పష్టం చేశారు. అయితే ప్రజలు ఫోన్లు, టీవీలను వినియోగించుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. బహిరంగ శిక్షలను వీడియోలు తీసి పంపడానికి ఫోన్ లాంటి మాధ్యమాలు ఉపయోగపడతాయన్న తురాబీ.. తద్వారా శిక్షలపై ప్రజల్లో అవగాహన, భయం ఏర్పడుతాయన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

అయ్యయ్యో వద్దమ్మా..సుఖీభవ!.. అలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు 

టిఫిన్ బాక్స్ బాంబులతో అటాక్‌కు ప్లాన్.. ఇంటెలిజెన్స్ అలర్ట్ 

తల్లికి థియేటర్ ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరో

దునియాకు ఇండియానే పెద్ద దిక్కు