హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు సీవీ ఆనంద్..ఈ సందర్భంగా మాట్లాడిన సీవీ ఆనంద్ క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు .. ఫ్రెండ్లీ పోలిసింగ్ అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ పోలీసింగ్ అన్నారు. డ్రగ్ర్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని చెప్పారు.ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంటామని చెప్పారు ఆనంద్.
Also Read :- ఓవర్సీస్లో దేవర హవా
రెండోసారి హైద్రాబాద్ సీపీ గా భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఆనంద్. ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వినాయకచవితి, మిలాద్ ఉన్ నబి పండుగలు ఉన్నాయి . పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తాను. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి.. అపుడు ప్రశాంతంగా జరిపాం. ప్రస్తుతం అన్ని రకాలుగా యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంది. పండుగ ఏర్పాట్లుక సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది.. పార్ట్ ఆఫ్ పోలీసింగ్ గా కొనసాగుతుందన్నారు. ప్రజలు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని తెలిపారు.