కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శన్ బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించాడు. నవంబర్ 27న కర్ణాటక హైకోర్టుకు దర్శన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. రేణుకాస్వామి గౌతమ్ అనే పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసి మహిళలకు అసభ్యకరమైన వీడియోలు, మెస్సేజ్ లు పంపాడని దర్శన్ తరపు న్యాయవాది సివి నగేష్ కోర్టుకు తెలియజేశాడు.
రేణుకాస్వామికి మహిళల పట్ల గౌరవం లేదని ఆయన అన్నారు. కర్ణాటక హైకోర్టు ఈ కేసులో రేణుకాస్వామి వల్ల సమాజానికి ముప్పు ఉందని చెప్పింది. అదే విషయాన్ని ఈ కేసులో హీరో దర్శన్ కూడా చెప్పాడు. దర్శన్ బెయిల్ కోసం అనుకూల వాదనలు కోర్టులో వినిపించారు. జూన్ 11న దర్శన్ ను అరెస్టు చేసి బళ్లారి జైలులో ఉంచారు. ఆయన వెన్నెముకకు ఆపరేషన్ చేయవలసి వచ్చిందని అక్టోబర్ 2024లో దర్శన్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నటి పవిత్ర గౌడతోపాటు మరో 15 మంది నిందితులుగా ఉన్నారు.