అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 10 వేదికల్లో మ్యాచ్‍లు జరగనుండగా, 45 రోజులపాటు ఈ టోర్నీ అభిమానులను అలరించింది. ఇదిలావుంటే తాజాగా ఐసీసీ, ఈ టోర్నీలో పాల్గొనే కామెంటేటర్ల జాబితాను ప్రకటించింది. మొత్తం 31 మంది సభ్యులున్న ఈ కామెంట్రీ ప్యానెల్‌లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన వరల్డ్‌కప్ విన్నర్లు చాలా మందే ఉన్నారు.
ALSO READ: సిక్స్‌కు 6 పరుగులు సరిపోవు.. 8, 10 పరుగులు ఇవ్వాలి: రోహిత్ శర్మ
వరల్డ్‌కప్ కామెంట్రీ ప్యానెల్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 8 మంది చోటు దక్కించుకోగా, భారత్ నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. భారత్ నుంచి స్టార్ వ్యాఖ్యాతలు హర్ష భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, దినేశ్ కార్తీక్, అంజుమ్ చోప్రా చోటు దక్కించుకున్నారు. ఈ ప్యానెల్‌లో దాయాది పాకిస్తాన్ కు చెందిన వారు ఇద్దరున్నారు.
వరల్డ్‌కప్ కామెంటేటర్ల జాబితా
ఆస్ట్రేలియా: రికీ పాంటింగ్, మాథ్యూ హెడెన్, షేన్ వాట్సన్, లిసా స్థాలేకర్, ఆరోన్ ఫించ్,మార్క్ నోకోలస్, డిర్క్ నన్నీస్, మార్క్ హోవార్డ్.
భారత్: సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రి, దినేశ్ కార్తీక్, హర్ష భోగ్లే, అంజుమ్ చోప్రా.
ఇంగ్లండ్: ఇయాన్ మోర్గాన్, నజీర్ హుసేన్, మైకేల్ అథెర్టోన్, ఇయాన్ వార్డ్.
న్యూజిలాండ్: ఇయాన్ స్మిత్, సైమన్ డుయల్, కాటే మార్టిన్.
దక్షిణాఫ్రికా: షాన్ పొలాక్, కాస్ నైడూ, నటాలీ జెర్మనోస్.
వెస్టిండీస్: ఇయాన్ బిషప్, శామ్యూల్ బద్రీ.
పాకిస్థాన్: రమీజ్ రాజా, వకార్ యూనిస్.
బంగ్లాదేశ్: అథర్ అలీఖాన్.
జింబాబ్వే: పామియో బంగ్వా.
శ్రీలంక: రసెల్ అర్నాల్డ్.
రమీజ్ రాజాపై భారత అభిమానులు ఆగ్రహం
ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు.. పాకిస్థాన్ రాకపోతే, తమ జట్టు ప్రపంచకప్‍లో పాల్గొనేందుకు ఇండియాకు వెళ్లబోదని రమీజ్ రాజా అప్పట్లో వ్యాఖ్యానించారు. దీంతో అతని ఎంపికపై కొందరు భారత అభిమానులు ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్‍గా ఉన్నప్పుడు రమీజ్ అన్న మాటను ఈ సంధర్భంగా గుర్తు చేస్తున్నారు.