IND vs ENG: దంచికొడుతున్న వర్షం.. ఇండియా- ఇంగ్లాండ్ మ్యాచ్ ఆలస్యం

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఇండియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. టాస్ పడే వరకు వర్షం పడే అవకాశాలు లేకపోయినా.. అనంతరం ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది. దీంతో సిబ్బంది హుటాహుటీన మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. గువాహటిలోని బరసప్ప వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

పలు మ్యాచ్‍లు వర్షార్పణం!

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‍లో పలు మ్యాచ్‌లకు వరుణుడి గండం పొంచి ఉంది. తొలి రోజు ఆఫ్ఘనిస్తాన్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. ఉప్పల్ వేదికగా జరిగిన పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మరోవైపు శనివారం ఆస్ట్రేలియా- నెదర్లాండ్స్ మ్యాచ్ జరగాల్సిన గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలోనూ వర్షం కురుస్తోంది.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

జట్లు:

భారత్ (బ్యాటింగ్ XI, ఫీల్డింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ. 

ఇంగ్లండ్ (బ్యాటింగ్ XI, ఫీల్డింగ్ XI): డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.