భారత క్రికెట్ జట్టు మొదటి వార్మప్ మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఇండియా- ఇంగ్లాండ్ జట్లు గువాహటిలోని బరసప్ప వేదికగా తలపడాల్సి ఉంది. అయితే, టాస్ పడే వరకు కానరాని వరుణుడు అనంతరం ఒక్కరిగా ఊడిపడ్డాడు. ఆపై ఎంతకూ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రధాన మ్యాచ్‌లకు ముందు డిఫెండింగ్ ఛాంపియన్‌లను ఓడించి ఆత్మవిశ్వాసంతో టోర్నీలోకి ఎంటర్ అవ్వాలన్న భారత్ అసలు అడియాసలు అయ్యాయి. ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ఆటగాళ్లు కనీస ప్రాక్టీస్ కూడా చేయలేకపోయారు. భారత జట్టు తదుపరి వార్మప్ మ్యాచ్ అక్టోబర్ 3న తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్‌తో జరగనుంది. కేరళలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ మ్యాచ్ జరిగేది అనుమానమే.
That's it folks, rain has the final say in Guwahati #CWC23 | #INDvENG pic.twitter.com/aLROiHkYvm
— ESPNcricinfo (@ESPNcricinfo) September 30, 2023